ప్రజెంట్ బిజీ లైఫ్‌స్టైల్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. శరీరంలోని కొన్ని లక్షణాలను అంతగా పట్టించుకోరు. దీని వల్ల ఎక్కువగా ఆరోగ్య సమస్యలొస్తాయి. షుగర్, హైబీపి వంటివి నేడు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. పొటాషియం అనేది శరీరానికి కావాల్సిన ఖనిజం. ఇది శరీరానికి సరిపడా ఉండాల్సిందే. రక్తపోటు వంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి పొటాషియం చాలా ముఖ్యం. రక్తపోటు తగ్గించేందుకు పొటాషియం లెవల్స్ బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. పొటాషియం గుండో ఆరోగ్యానికి, ఎముకలు, నరాల ఆరోగ్యానికి చాలా మంచిది.
చిలగడదుంప
చిలగడదుంపలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. షుగర్, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడేందుకు చిలగడదుంప చాలా మంచిది. ఇది కంటిచూపుకి కూడా మంచిది. చిలగడదుంపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
గుండెపోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయ్..!
అరటిపండ్లు
పొటాషియం పుష్కలంగా ఉండే పండ్లలో అరటిపండ్లు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు బరువు కంట్రోల్‌లో ఉంటుంది. దీనికోసం సీడ్స్, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యానికి ఎంతో మంచివి. అరటిపండులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మీడియం అరటిపండు మీకు ప్రతిరోజుకి అవసరమైన విటమిన్ బి6లో నాలుగింట ఓ వంతు అందిస్తుంది. ఇది మీ జీవక్రియకి కూడా మంచిది. బ్రెయిన్ డెవలప్‌మెంట్, ఇమ్యూనిటీని పెంచడంలో కీ రోల్ పోషిస్తుంది.
కొబ్బరినీరు
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొబ్బరినీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ నీటిలో సోడియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ కొబ్బరినీటిలో పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని తాగితే శరీరానికి శక్తి అందుతుంది. ఈ నీరు తాగితే రక్తపోటు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
ఆకుకూరలు
చాలా మంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి. బచ్చలికూర, బ్రకోలీ వంటి ఆకుకూరలు తినడం వల్ల బీపి కంట్రోల్‌లో ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తక్కువ కేలరీలతో పాటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బరువుని కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునేవారు ఆకుకూరలు తీసుకోవాలి. ఇది అన్నీ వయసుల వారికి ఆకుకూరలు మంచివి.