సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తింటివారు 108 రకాల వంటకాలతో సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా శాంతి నగర్‌లో నివాసముంటున్న సర్పంచ్ మంగరాములు కుమార్తె నిషాకు డాక్టర్ శ్రీకాంత్‌తో వివాహం చేశారు.
ఈ క్రమంలో అల్లుడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ ఇంటికి రావడంతో కొడుకు కోడలితో కలిసి కూతురు,అల్లుడికి అద్భుత ఆతిథ్యం ఇచ్చారు.