బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని... విచారిస్తున్నట్లు ఉదయం నుంచి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై ముంబై పోలీసులు స్పందించారు. బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తిని తీసుకువచ్చామని, కానీ అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.సైఫ్ అలీఖాన్ కేసుకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.కాగా, ఈ ఉదయం పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదని పోలీసులు తాజాగా స్పష్టం చేశారు