రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం 12 మంది భారతీయులు మృతి చెందినట్లు శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన భారతీయులు అంతా రష్యా తరుపున పోరాడిన వారేనని వెల్లడించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజు వరకు రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య 126గా నమోదైందని, ఈ కేసుల్లో 96 మంది ఇండియాకు తిరిగి వచ్చారని చెప్పారు.