ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉచిత విద్యుత్తు ఎత్తివేత ప్రచారం.. మంత్రి క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 03:46 PM

తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు. వైసీపీ నేతలు.. మొన్నటి వరకూ వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నామని చేసిన విష ప్రచారం బెడిసికొట్టిందన్నారు. ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు.9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడంలో ఎలాంటి మార్పులు లేవని విద్యుత్తు శాఖ మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలో ఓ పత్రిక ప్రజలను తప్పు దోవ పట్టించాలని ప్రయత్నిస్తోందన్నారు. అసత్య వార్తలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ విధ్వంస పాలనకు, చంద్రబాబు సంక్షేమ పాలనకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com