శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగియనున్నాయి. పదిరోజుల వ్యవధిలో 6 లక్షల 80 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా.. 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపుతున్నారు. ఆదివారంతో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈనెల 10 నుంచి 19 వరకు అంటే దాదాపు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ అధికారులు మూసివేయనున్నారు.