మదనపల్లి సార్వజనిక జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక నిరాహార దీక్షలకు పూనుకున్నారు. బీఎస్పీ, సీఐటీయూ, సీపీఎం, ఏఐటీయూసీ, బహుజన నేతలు దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. జిల్లా ఆస్పత్రిని ప్రైవేటు పరం చేస్తే పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు.