ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి డీజీపీ తిరుమలరావు మంగళవారం సాయి కుల్వంత్ సభా మందిరంలో ఉన్న శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎస్ పి వి. రత్న, డి ఎస్ పి లు, అనంతపురం జిల్లా డిఐజి, పుట్టపర్తి టిడిపి నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు.