ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నటు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లిథియం బ్యాటరీలపై ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో EV ధరలు తగ్గనున్నాయి. విద్యుత్ సంస్కరణలకు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలని తెలిపారు. వర్థమాన ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని ఆమె వెల్లడించారు.