బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిపారు. అలాగే సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని జ్ఞాన సరస్వతిదేవిగా విశేష అలంకరణ నిర్వహించి సరస్వతి సహస్రనామ స్తోత్రం పారాయణం నిర్వహించారు. చిన్నారులకు సద్గురుదేవానంద మెమోరియల్ పాఠశాల ఆర్థిక సహాయంతో పుస్తకాలు పలకలు పెన్నులు అందించారు.