ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌కు ఘన విజయం అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్నెన్నాయుడు కోరారు. ప్రతి ఒక్క కూటమి కార్యకర్త, నేత వారి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఒక టీచర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోమసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. "ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాజశేఖర్ గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి.
పట్టభద్రుల వద్దకు వెళ్లి అభ్యర్థిని గెలిపించేలా ప్రచారం చేయాలి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి అవగాహన కల్పించాలి. కూటమి అభ్యర్థులను గెలిపించడమే మన ముందున్న ప్రథమ లక్ష్యం. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ను ప్రకటిస్తాం. రాజోలులో ఇంటింటికీ మంచినీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. వ్యవసాయానికి పెద్దపీట వేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు.
![]() |
![]() |