వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్లీ గెలుస్తుంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం అని మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం. ఇది కచ్చితంగా చెబుతున్నాను. జగనన్న 1.0 లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్ధలను చూశాను. అందుకే ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు అని హామీఇచ్చారు.
![]() |
![]() |