ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌కు ఇరాన్ షాక్.. ఉగ్రముఠాలను ధ్వంసం చేస్తాం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 08:16 PM

జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, తెహ్రీకే తాలిబాన్ వంటి నానాజాతి ఉగ్రవాద సంస్థలకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్‌.. భారత్ చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. చివరికి ఆయుధ, ఆర్థిక సాయం చేస్తున్న అమెరికానూ తూచ్ అంటోంది. భారత్‌లో ఉగ్రదాడులు చేయిస్తోంది.  ఈ నేపథ్యంలో పాక్ పొరుగుదేశం ఇరాన్ కన్నెర్రజేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలను తాము నిర్మూలిస్తామని ఇరాన్ ఆర్మీ జనర్ కాసిమ్ సోలీమనీ హెచ్చరించారు. ‘ఉగ్రవాదులను నిర్మూలించాలని ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు. మీవద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. అయినా చేతగానట్లు నటిస్తున్నారు. మీ పొరుగుదేశాల్లో అశాంతి రేపుతున్నారు… మీరు పద్ధతి మార్చుకోకపోతే మీ ఉగ్రవాద సంస్థలపై మేం  దాడులు చేస్తాం..’ అని ఆయన హెచ్చరించారు. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఇరాన్ వెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, భారత్ సంబంధాలు కొన్నేళ్లుగా బలోపేతం అవుతున్నాయి. ఇరాన్‌ను ద్వేషిస్తున్న సౌదీ అరేబియా నుంచి పాక్‌కు సాయం అందుతోంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa