రేపు ప్రభుత్వ విప్ లతో సమావేశం కానున్న చీఫ్ విప్ ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. గత జులైలో చంద్రబాబు సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. ఈనెల 24న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.Aసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రేపు ప్రభుత్వ విప్ లతో చీఫ్ విప్ సమావేశం కానున్నారు. సమావేశాల నిర్వహణపై వీరు ప్రధానంగా చర్చించనున్నారు. 24న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత... బీఏసీ సమావేశం నిర్వహించి... సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు
![]() |
![]() |