ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ని గెలిపించేందుకు కెసిఆర్‌ డ్రామాలాడుతున్నారు : దేవినేని ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 05:12 PM

 జగన్‌ని ఎన్నికల్లో గెలిపించేందుకు కెసిఆర్‌ డ్రామాలాడుతున్నారని టిడిపి నేత‌ దేవినేని ఉమా విమర్శించారు. మంగళవారం టిడిపి జిల్లా పార్టీ ఆఫీస్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడుతూ.. జగన్‌ను గెలిపించేందుకు కెసిఆర్‌ అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. నాలుగు రోజుల నుండి తెలంగాణ గవర్నమెంట్‌ ఆడుతున్న డేటా డ్రామాని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. కొన్ని సంవత్సరాలు కష్టపడి టిడిపి కార్యకర్తలు మా సేవా మిత్ర యాప్‌కి పని చేసిన డేటా అంతా కెసిఆర్‌ దొంగతనం చేసి, జగన్‌కి ఇస్తున్నాడని ఆరోపించారు. దీనికి ప్రజలే రాబోయే ఎన్నికల్లో వైసిపి కి తగిన బుద్ధి చెబుతారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa