AP: అనంతరపురం జిల్లా నాయన పల్లి శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. కారులో ఇద్దరు ప్రయాణికులు ఉండగా.. షాబుద్దీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |