ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త నరకం భరించలేక భార్య ఆత్మహత్య!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 07:19 PM

అసహజ శృంగారం కోసం భర్త చేస్తున్న వేధింపులు భరించలేక.. అతనితో కలిసి జీవించలేక.. ఓ అభాగ్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం.. నాగేంద్రబాబు అనే వ్యక్తికి గాజువాక ప్రాంతానికి చెందిన ఓ యువతితో 2024 మార్చిలో వివాహమైంది. ఈ పెళ్లిని పెద్దలు కుదిర్చారు. నాగేంద్రబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఉంటారు. పెళ్లైన కొన్ని రోజులు వీరి దాంపత్య జీవితం సుఖంగానే సాగింది.


ఆ తర్వాత నాగేంద్రబాబులోని అసలు మనిషి బయటకు వచ్చాడు. గత కొన్ని నెలలుగా భార్యను వేధించడం మొదలెట్టాడు. ఆన్ లైన్‌లో పోర్న్ వీడియోలు చూసే అలవాటున్న నాగేంద్రబాబు.. వాటికి బానిసగా మారిపోయాడు. పోర్న్ వీడియోల తరహాలోనే తనతో ఉండాలంటూ భార్యను వేధించడం మొదలెట్టాడు. అయితే ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. చివరకు ఈ వేధింపులు ఎక్కువ కావటంతో వీటిని భరించలేక గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.


 మరోవైపు బాధితురాలు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు చేరవేశారు. అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి కుటుంబసభ్యులు ఆమెను గోపాలపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలోనే మృతురాలి తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


మరోవైపు నాగేంద్రబాబుకు నరాల బలహీనత ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అలాగే సామర్థ్యం పెంచుకునేందుకు ట్యాబ్లెట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పోర్న్ వీడియోలు చూస్తూ ఆ విధంగా శృంగారం చేయాలని ఒత్తిడి చేయడంతోనే అతని భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa