ఏ ప్లస్ ప్లస్ గుర్తింపు కోసం నాక్ (నేషనల్ అసె్‌సమెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) అధికారులకు లంచాలు ఇచ్చి జైలు పాలైన కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులకు షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ సీబీఐ కోర్టు సోమవారం తిరస్కరించింది. కొద్దిరోజుల క్రితం ఈ కేసులో సీబీఐ పది మంది నిందితులను అరెస్టు చేసింది. ఇందులో నాక్ అధికారులతోపాటు కేఎల్ వర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులు కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa