అమెరికా ప్రభుత్వం అందించే సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ (ఎస్ఎస్ఏ) లబ్ధిదారుల డేటాను సవరించకపోవడంపై ఎలాన్ మస్క్ అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఏకంగా ఓ వ్యక్తికి 360 ఏళ్లుగా చూపడంపై విమర్శలు గుప్పించారు. సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ రికార్డుల ప్రకారం.. అమెరికాలో 100 ఏళ్ల నుంచి 200 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 2.30 కోట్ల మంది, 200 ఏళ్లు పైబడిన వారు 2 వేల మంది ఉన్నారంటూ మస్క్ ఎద్దేవా చేశారు. అమెరికా జనాభా కన్నా ఎస్ఎస్ఏ లబ్ధిదారుల సంఖ్యే ఎక్కువగా ఉండడం వింతల్లోకెల్లా వింత అంటూ ట్వీట్ చేశారు. అయితే, మస్క్ ఆరోపణలను ఎస్ఎస్ఏ అధికారులు తోసిపుచ్చారు. ఆ లిస్టులోని ఉన్న వాళ్లలో వందేళ్లు ఆపైన ఉన్న వారు ప్రభుత్వం నుంచి జీవన భృతి తీసుకోవడం లేదని చెప్పారు. సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa