అనంతపురం 12వ డివిజన్ కార్పొరేటర్ బాబా నగర పాలక సంస్థ ఎంహెచ్ఐని ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య కార్మికులకు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు.
మజ్జిగ, గ్లూకోస్ పౌడర్ లాంటి పానీయాలను అందించాలని తెలిపారు. కార్మికులతోనే నగర శుభ్రత సాధ్యమని, ఇలాంటి వారిని గుర్తించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
![]() |
![]() |