రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగుల నిర్మించి ఇస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను ఆయన కోరారు.
ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఆ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయిస్తామని హామీ ఇచ్చారు.
![]() |
![]() |