ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 03:23 PM

అమరావతి : ఎపి సిఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. జేసీ సోదరుల వారసులకు చంద్రబాబు అవకాశమిచ్చారు. అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఎనిమిది స్థానాలకు టిడిపి అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. మరో ఆరు స్థానాలను పెండింగ్‌ లో పెట్టారు. అనంతపురం ఎంపి అభ్యర్థిని ప్రకటించారు. నిన్న (బుధవారం) రాత్రి 10 గంటల వరకు కసరత్తు చేసి, తన వద్ద ఉన్న సర్వేల ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించారు. ఈ తొమ్మిది మందిలో జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు పవన్‌ కుమార్‌ రెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. తమ వారసుల కోసం జేసీ సోదరులు పోటీకి దూరంగా ఉంటామని ఇది వరకే ప్రకటించిన సంగతి విదితమే. చంద్రబాబు ప్రకటించిన పేర్లలో ఎక్కువ మంది సిట్టింగులే ఉన్నారు.


 


చంద్రబాబు ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులు వీరే :


1. రాప్తాడు - పరిటాల సునీత


2. పెనుకొండ - బికె పార్థసారథి


3. రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు


4. ధర్మవరం - గోనుగుంట్ల సూర్యనారాయణ


5. అనంతపురం - ప్రభాకర్‌ చౌదరి


6. హిందూపురం - బాల‌కృష్ణ‌


7. మడకశిర - ఈరన్న


8. తాడిపత్రి - జేసీ అస్మిత్‌ రెడ్డి


9. అనంతపురం ఎంపీ అభ్యర్థి - జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa