రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలు ముంబైలో ఘనంగా ప్రారంభమమ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అన్నసేవా కార్యక్రమం నిర్వహించి అనాథ పిల్లలకు భోజనం వడ్డించారు. ముంబైలోని అనాథ, వృద్ధాశ్రమాలకు ఏడాది పాటు ఆహార సామాగ్రిని ఉచితంగా అందజేస్తామని ఈ సందర్భంగా నీతా అంబానీ వెల్లడించారు. అటు ముంబైలో ధీరూబాయ్ అంబానీ స్క్వేర్‌ను ప్రారంభించి ముంబైకర్లకు అంకితమిచ్చారు. మార్చి 11 వరకు అంబానీ ఇంట పెళ్లి సంబరాలు జరగనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను ఆకాశ్ పెళ్లాడుబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa