హైదరాబాద్ : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్‌వ్యాగన్‌కు రూ. 500 కోట్లు జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఇవాళ తీర్పు ఇచ్చింది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాల ప్రమాణాల నిబంధనలను వ్యోక్స్‌వ్యాగన్ సంస్థ ఉల్లంఘిస్తోందని, ఆ వాహనాల అమ్మకాలపై నిషేధం విధించాలని ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. డీజిల్ కార్ల విషయంలో వ్యోక్స్ వ్యాగన్ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు 2 నెలల్లో మొత్తం జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని వోక్స్‌వ్యాగన్ సంస్థ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa