ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభ‌వంగా ముగిసిన మ‌హా శివ‌రాత్రి క‌ల్యాణోత్స‌వాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 02:06 AM

విజ‌య‌వాడ‌ ఇంద్ర‌కీలాద్రి లోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం దత్తత దేవాలయమైన శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి వారి దేవాలయము (బుద్దవారి గుడి) బ్రహ్మణవీధిలో మ‌హాశివరాత్రి కళ్యాణోత్సవాల కార్యక్రమాలు గురువారంతో దిగ్విజయంగా పరి సమప్తి అయ్యాయి. ఈ సంధర్బంగా ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వ‌హించారు. ఆలయ కార్యనిర్వహణాదికారి వి.కోటేశ్వరమ్మ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు వైదిక కమీటీ ఆధ్యర్వంలో నిర్వహించారు. అనంత‌రం వసంతోత్సవం, అపభృత్రోత్సవము జరుపుకుంటూ ఉత్సవమూర్తులను కృష్ణా నదీ తీరంలో ఊరేగింపు నిర్వ‌హించారు. అదేవిధంగా మ‌హా శివ‌రాత్రి క‌ల్యాణోత్స‌వాలు ముగింపు సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై మ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌యం (శివాల‌యం) వ‌ద్ద గురువారం సాయంత్రం నిర్వ‌హించిన సాంస్క్ర‌తిక కార్య‌క్ర‌మాల్లో భాగంగా కూచిపూడి నృత్యంలో పాల్గొని అంద‌రిని ఆశ్ఛ‌ర్య‌ప‌రిచిన దుర్గ‌గుడి ఈవో కోటేశ్వ‌ర‌మ్మ కుమార్తె దేవిశ్రీ. యుకేజీ చదువుతున్న ఈ చిన్నారి అద్భుత నృత్య ప్ర‌ద‌ర్శ‌న తిల‌కించిన భ‌క్తులు మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని చిన్నారిని అభినందించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa