CSK LIVE Score Updates: 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
*పవర్‌ప్లే ముగియక ముందే భారీ షాక్ : ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) జాకబ్ డఫీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఒక సిక్సర్‌తో జోరుగా కనిపించినా, భారీ షాట్ ప్రయత్నంలో పాయింట్‌కి దొరికిపోయాడు. వెంటనే వచ్చిన ఆయుష్ మ్హత్రే (1) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ (9) కూడా పెద్ద స్కోర్ ఇవ్వలేక, చెన్నై మొదటి 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
*సర్ఫరాజ్ ఖాన్ ధైర్యం చూపిస్తూ : అయితే, ఈ షాక్ మధ్య సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో నిలబడాడు. ఆర్సీబీ పేసర్లను ఎదుర్కొంటూ బౌండరీలు కొట్టుతూ చెన్నై ఆశలను సజీవంగా ఉంచాడు. 5 ఓవర్లు ముగిసేసరికి సర్ఫరాజ్ 30 పరుగులతో ఉన్నప్పటికీ, విజయానికి కావాల్సిన రన్ రేట్ 13 పైన ఉండటం వల్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల పై భారీ ఒత్తిడి ఉంది. మరోవైపు, ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ చెన్నైని ఆటంకులో పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa