సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక హామీ అమలుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ‘తల్లికి వందనం’ పథకానికి 2025-26 బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ సంవత్సరం నుంచి అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున ఈ పథకానికి మొత్తం రూ.12వేల కోట్లు అవసరం. ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయించకపోవడంతో ప్రభుత్వం అదనంగా నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa