ఎత్తిపోతల పథకాలకు సొంతంగా విద్యుదుత్పత్తి చేసుకోవడానికి గుజరాత్‌లోని నర్మదా సరోవర్ మోడల్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. ఆ మోడల్ అధ్యయనం కోసం రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్ అధికారుల బృందం వెళ్లి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. దీనిపై ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు ఆ బృందంతో శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గుజరాత్‌లో భారీ నీటి ప్రాజెక్టుల నిర్వహణ, గట్లపై కరెంట్ ఉత్పత్తి గురించి ఆరా తీశారు. మధ్యప్రదేశ్, ఒడిశాల్లోనూ జల వనరుల శాఖ ఇంజనీర్లు పర్యటించారు. ఈ అధ్యయన నివేదికలను సమగ్రంగా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa