దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. 2019లో ఆయన తీసిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీపై అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో ఇంతకుముందు జారీ అయిన నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగానే... ఆర్‌జీవీకి సీఐడీ నుంచి ఇప్పుడు మరోసారి నోటీసులు అందాయి. ఇక ఈ కేసుకు సంబంధించి వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు గత నెల 10న నోటీసులు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు డుమ్మా కొట్టి, తన న్యాయవాదిని సీఐడీ ఆఫీస్‌కు పంపించారు. సినిమా పనులతో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, తనకు 8 రోజుల గడువు కావాలని కోరారు. కానీ, ఈరోజు వర్మకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు పంపించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa