ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలను దేవతల్లా చూసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 10:42 AM

మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ(శనివారం) భీమవరంలో 2కే వాక్ జరిగింది. ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ వేలాది మందితో వాక్ నిర్వహించారు. 2కే వాక్‌లో జిల్లా కలెక్టర్ నాగరాణి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ గోపిమూర్తి పాల్గొన్నారు. మహిళామణులు అందరికీ రఘురామ కృష్ణంరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడారు. ఆలయాలకు వెళ్తే దేవతలను పూజిస్తామని.. కానీ ఇంటికి వెళ్తే అందుకు భిన్నంగా కొందరు ప్రవర్తిస్తారని అన్నారు. ఇంట్లో కూడా మహిళలను దేవతల్లా చూసుకోవాలని చెప్పారు. ఈ ఒక్కరోజైనా ఇంట్లో సగం పని మహిళలతో షేర్ చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa