ఆమె భర్త ఉద్యోగం నిమిత్తం కువైట్‌లో ఉంటున్నాడు. ఇక్కడ ఒంటరిగా ఉంటున్న ఆమె... తన స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం కాస్తా బయట పడడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే అదే రోజు ఆమె ప్రియుడు కూడా బైక్‌తో సహా కాలి బూడిదయ్యాడు. దాంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదం జరిగిందా? లేక వివాహితతో సంబంధం గురించి తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు దాడి చేసి చంపేశారనే అనేది మిస్టరీగా మారింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని చిన్నచౌకు ఎస్టీకాలనీకి చెందిన శ్రావణ్... కడప పట్టణంలో ఓ జిమ్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. చింతకొమ్మదిన్నె మండలంలోని పడిగెలపల్లె గ్రామానికి చెందిన 25 ఏళ్ల సరస్వతి అనే యవతితో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
పెళ్లికి ముందే శ్రావణ్‌తో పరిచయం ఉన్న సరస్వతి... పెళ్లైన తర్వాత అతన్ని దూరంపెట్టింది. కేవలం ఫోన్‌లో మాత్రమే మాట్లాడుకునేవాళ్లు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సరస్వతి భర్త ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లిన తర్వాత శ్రావణ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది సరస్వతి. అయితే తాజాగా శుక్రవారం చింతకొమ్మదిన్నెలో జరిగిన ఓ జాతరకు వచ్చిన శ్రావణ్... సరస్వతిని చూసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని, ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను కాపాడేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించాడు. ఆమెను బైక్ మీద ఎక్కించుకునేటప్పుడు స్థానికులు గమనించి, నిలదీయడంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయాడు. సరస్వతిని గ్రామస్థులు స్థానిక ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది... ఆమె అప్పటికే చనిపోయిందని తేల్చారు వైద్యులు. పడిగెలపల్లె నుంచి బైక్ మీద పారిపోయి వచ్చిన శ్రావణ్... వెంకటగారిపల్లె సమీపంలో బైక్‌తో సహా కాలిపోయి చనిపోయి కనిపించాడు. భయంతో తన మీద తానే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక సరస్వతి గ్రామస్థులు గానీ,కుటుంబీకులు గానీ దాడి చేసి చంపేశారా? లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా అనేది మిస్టరీగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa