AP: రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత పెరగనుంది. 'ఎల్ నినో' ప్రభావంతో ఈసారి ఉష్ణోగ్రతలు గతేడాదితో పోలిస్తే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ నెల 28వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa