AP: టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నిన్న నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌లో కేజీ టమాటా కేవలం రూ.1-3 పలికింది. ఒక రైతు 105 బాక్సుల టమాటాను తీసుకెళ్తే, వ్యాపారి బాక్సుకు రూ.35 చొప్పున లెక్కగట్టి, కమీషన్లు మినహాయించి కేవలం రూ.2 వేలు ఇచ్చారు. దాంతో రవాణా ఖర్చులు కూడా రాలేదని ఆ రైతు వాపోయారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కేజీ టమాటా రూ.3-7, మదనపల్లెలో రూ.7, అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.2-3, కక్కలపల్లిలో రూ.3-7 పలికింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa