జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ నోవోటల్ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం, క్షేత్రస్థాయి పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించడం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa