హిందూ, సిక్కు, బౌద్ధ మతాల నుంచి ఇతర మతాలకు ఎవరు మారినా షెడ్యూల్ కులాల హోదా పోతుందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. మతం మారిన తర్వాత ఆ మతంలోని కులాన్ని కొనసాగించడం, దాని పేరుతో రిజర్వేషన్లు పొందడం కుదిరే ప్రసక్తే లేదని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ విషయమై ఒక స్పష్టతనిచ్చింది. హిందూ మతం నుంచి కానీ , సిక్కు, బౌద్ధ మతాల నుంచి క్రైస్తవ మతంలోకి మారి షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను కొనసాగించాలనుకుంటే అది వీలు కాదని చెప్పింది. ఈ విషయంలో 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని తెలిపింది. మతం మారిన తర్వాత ఆ కులంలో పొందే ఎటువంటి ప్రయోజనాలు కానీ, రిజర్వేషన్ కానీ దేనికీ అర్హత ఉండదని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని కూడా పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa