ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీట్ల పెంపుతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 24, 2026, 02:47 PM

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపుతో ఏపీలో రాజకీయ చర్చ మొదలైంది. ఈ లెక్కన ఏపీలో అసెంబ్లీ 269కి, 38 ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. సీట్ల పెరుగుదల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి లాభదాయకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 175 సీట్లలో 164 సాధించిన కూటమి, 269 సీట్లలో 135 మ్యాజిక్ ఫిగర్‌ను సులభంగా చేరుకోవచ్చని అంచనా. అధికారంలో ఉన్న కూటమి పునర్విభజనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే, వైసీపీకి పెరిగిన సీట్లతో అభ్యర్థులను నిలబెట్టడం, గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పెద్ద సవాలుగా మారనుంది. మహిళా రిజర్వేషన్లు, సమర్థుల కొరత వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa