జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా విభజన జరిగిందని మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంపై పెట్టిన శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై పెట్టలేదన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు స్థలాలు కేటాయించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వస్తోందన్నారు.
![]() |
![]() |