ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ డ్రోన్‌ను తరిమికొట్టిన బీఎస్‌ఎఫ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 03:48 PM

భారత భూభాగంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్‌ చేసిన ప్రయత్నాన్ని సరిహద్దు రక్షణ దళం(బీఎస్‌ఎఫ్‌) తిప్పి కొట్టింది. శనివారం రాజస్థాన్ సరిహద్దు వెంట మన దేశంలోకి ప్రవేశించడానికి డ్రోన్‌ విఫల ప్రయత్నం చేసింది. అయితే డ్రోన్ రాకను పసిగట్టిన బీఎస్‌ఎఫ్ దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్‌ సమీపంలోని హిందూమల్‌కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఇది భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ వెంటనే దళాలు కాల్పులు జరిపి, దాన్ని వెనక్కి మరలేలా చేశాయి. అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్‌ డ్రోన్‌ భారత్‌లోకి ప్రవేశించడానికి చేసిన మరో ప్రయత్నం ఇది. పెద్దఎత్తున ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని సరిహద్దు సమీపంలో నివసించే గ్రామస్థులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa