ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద‌ల భూప‌ట్టాల‌కు ఎమ్మెల్ల్యేనే అడ్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 04:07 PM

 నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయంలో శ‌నివారం జరిగిన‌ పేదలకు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజ‌రై శ్రీకారం చుట్టారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసి పట్టాలు తయారుచేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బందికి మంత్రి సోమిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు జిల్లాలో 46 ఏళ్ల నాటి సీజేఎఫ్ఎస్ ను రద్దు చేసి 60,596 మంది లబ్ధిదారులకు సుమారు 8 వేల కోట్ల విలువైన భూములపై యాజమాన్య హక్కులు కల్పించాం, ప్రస్తుతం పేదలకు మరో 7 వేల ఎకరాలకు పైగా పంపిణీ చేయాలని అసైన్మెంట్ కమిటీ నిర్ణయించింది, తగినంత సమయం లేనందున తీర్మానంను సర్క్యులేషన్ గా పంపి సంతకాలు చేశాం, సర్వేపల్లి నియోజకవర్గంలో 1,110 మందికి 1,441 ఎకరాలు పంపిణీ చేసేందుకు అధికారులు తీర్మానం కాపీ తీసుకెళితే సంతకం పెట్టకపోగా,పట్టాలు పంపిణీ చేసేదానికి లేదని అధికారులను బెదిరించిన ఘనత ఎమ్మెల్యేది, ప్రస్తుతం 525 మందికి 604.55 ఎకరాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేస్తున్నాం, ఇప్పటికే పంపిణీ ప్రారంభించాం కాబట్టి, కోడ్ వచ్చినా మిగిలిన వారికి అందజేయవచ్చు..కానీ అడ్డంకులు సృష్టించే పెద్దమనిషి మనకున్నాడు. ఎన్నికల కోడ్ రావడం రెండు రోజులు ఆలస్యమైనా మిగిలిన వారందరికీ కూడా పట్టాలు పంపిణీ చేయించే బాధ్యత నాది, పేదలు, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పని చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదేళ్లలో 2 వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం, మేం అభివృద్ధి చేసుకుంటూపోతుంటే నన్ను, నన్ను నా కుమారుడిని తిట్టడమే ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నారు, తోడేరులో నేను పర్యటిస్తే అరిష్టమంటూ మహిళలతో బలవంతంగా పసుసు నీళ్లు చల్లించడం లాంటి నీచ రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయాడు. చట్టసభ సభ్యుడిగా ప్రజల కోసం పనిచేయాల్సిందిపోయి మేం ఏం పనిచేస్తున్నా అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa