నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆదేశాల మేరకు వైద్య రంగం లోని సిబ్బంది , మహిళా సంక్షేమ శాఖలు , మెప్మా సభ్యులు , విద్య శాఖ సిబ్బంది , DRDA శాఖ ల ఉద్యోగస్తులు సహాయ సహకారాలతో మార్చ్ 10 వ తేది పోలియో ఆదివారం నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నెల 10 , 11 , 12 తేదీల్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా లో 372 బూతులు , 82 సంచార బూతులు , ఏర్పాటు చేస్తున్నారని అలాగే ఈ పల్స్ పోలియో చుక్కల కార్య క్రమం లో 12 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. పని చేసే వారిలో మన ఐదు సంవత్సరపు లోపు ఉన్న తమ తమ పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలని వారు అన్నారు . వాస్తవానికి ఫిబ్రవరి లో జరుగవలసిన ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం కొన్ని కారణాల వల్ల మార్చి నెల 10 వ తేదీ కి వాయిదా పడిందని అన్నారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలనీ వారు పిలుపు నిస్తున్నారు . సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి షార్ బస్టాండ్ సమీప వై జాన్సన్ వరకు పలువురు ఆశ మరియు ఆసుపత్రి సిబ్బంది పల్స్ పోలియో చుక్కలు వేయించండి . “పోలియో వ్యాధి ని తరిమి కొట్టండి” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కార్య క్రమం నిర్వహించారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోప్రజలకు తెలియడానికి మైక్ ద్వార ప్రచారం, బ్యానర్లు ఏర్పాటు చేశామని కూడా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa