ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (బుధవారం) ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు అడిగిన వివిధ అంశాలపై పలువురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఏఏ ప్రాంతాల్లో భూముల సర్వే జరుగుతుందో వివరించారు. భూ హక్కులు ఉన్న యజమానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. 2లక్షలకు పైగా ఆర్జీలు భూ వివాదాలపైనే వచ్చాయని అన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతుందని తెలిపారు. గత వైసీపీప్రభుత్వం భూ సర్వేను అవినీతి మాయంగా మార్చిందని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం భూ సర్వే పేరుతో మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.
![]() |
![]() |