విశాఖ, గాజువాక కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న టిప్పర్.. బైకును ఢీ కొంది. ఈ ఘటనలో వైక్‌పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa