ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రజలు కృషి చేయాలని వేపాడ తాసిల్దార్ రాములమ్మ అన్నారు. శనివారం వేపాడ జడ్పీ హైస్కూల్లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె ఎంపీడీవో సూర్యనారాయణ తదితర మండల అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలని ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.
![]() |
![]() |