ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను టిడిపి శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎలమంచిలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శనివారం అచ్యుతాపురంలో మునగపాక మండల టీడీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జడ్పీ మాజీ చైర్ పర్సన్ లాలం భవాని పాల్గొన్నారు.
![]() |
![]() |