హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్‌ను కూడా చేర్చాలని లోక్‌సభ వేదికగా వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ ను ఈ ప్రాజెక్టులో చేర్చలేదనివైఎస్సార్‌సీపీఎంపీ తనూజరాణి స్పష్టం చేశారు. సోమవారం లోక్ సభలో రైల్వే శాఖ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘హౌరా చెన్నై మెయిన్ లైన్ లో వయా వైజాగ్ ద్వారా ప్రతిరోజు 508 ట్రైన్లు వెళ్తుంటాయి. అమరావతికి 363 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్ కు హై స్పీడ్ ట్రైన్ కనెక్టివిటీ కల్పించాలి’ అని ఆమె కోరారు. ‘రాయగడ డివిజన్ లోకి అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ ను మార్చవద్దు. వాల్తేరు డివిజన్లోని అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ ను కొనసాగించాలి. ఈ మార్పు వల్ల గిరిజనుల సెంటిమెంట్ దెబ్బతింటుంది’ అని ఆమె పేర్కొన్నారు.
![]() |
![]() |