వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తమ మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చి తల్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా, పిచ్చమ్మ మృతిపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (18.03.2025) బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
![]() |
![]() |