విద్యార్థుల భవిష్యత్ కోసమైనా పెండింగ్ ఫీజులు చెల్లించాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై సోమవారం శాసనమండలిలో వైయస్ఆర్‌సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్టు మంత్రి బాల వీరంజనేయ స్వామి వెల్లడించడతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆగ్రహం చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సభలో మాట్లాడుతూ..రూ. 4200 కోట్ల ఫీజులు, రూ.2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయని చెప్పారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి..ఇప్పటి వరకూ ఇవ్వలేదని తప్పుపట్టారు.
![]() |
![]() |