ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 20, 21వ తేదీలలో తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, ఇంజినీరింగ్, గార్డెన్, అన్న ప్రసాదం అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం అన్న ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులతో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa