గరుగుబిల్లి మండలం గిజబ ప్రాంతంలో గజరాజులు సంచారంతో ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిజబలో చెరకు, అరటి, పామాయిల్ పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఇక బాసంగిలో పంటలు నాశనం కాకముందే వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటవీ సిబ్బంది, ట్రాకర్లు గజరాజులను పర్యవేక్షిస్తున్నారు. అవి గ్రామాల వైపు రాకుండా చూస్తున్నారు. నాగావళి నది మార్గం గుండా బాసంగి ప్రాంతానికి చేరుకునేలా చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa