నాసా ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి సురక్షితంగా తిరిగి చేరడం ప్రపంచమంతా గర్వించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు తెలుపుతూ మంత్రి కార్యాలయం నుండి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసారు. సునీతా విలియమ్స్ అంకితభావం, శాస్త్రీయ పరిశోధనలలో విశేష సేవలను అందించారని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa